Scroll down for English report –
హైదరాబాద్‌ AITUC సమావేశంలో నాలుగు లేబర్ కోడ్‌లకు వ్యతిరేకంగా ‘నిరవధిక సార్వత్రిక సమ్మె’కు పిలుపునివ్వాలని మజ్దూర్ బిగుల్ విజ్ఞప్తి చేసింది.
హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్‌లో జరిగిన AITUC తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో మజ్దూర్ బిగుల్ పాల్గొంది. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన కొత్త నాలుగు లేబర్ కోడ్‌లపై అవగాహన కల్పించేందుకు ఈ సమావేశాన్ని నిర్వహించారు.
మజ్దూర్ బిగుల్ ప్రతినిధి సుహాస్ సమావేశంలో మాట్లాడుతూ, ఈ కొత్త చట్టం ‘ఫ్లోర్ లెవెల్ వేజ్’ (కనీస వేతన పరిమితి) అనే విధానాన్ని ప్రవేశపెడుతోందని, ఇది అత్యల్ప వేతనాలకు బెంచ్‌మార్క్‌గా మారే ప్రమాదం ఉందని వివరించారు. గతంలో ప్రభుత్వ కమిటీలు రోజుకు కేవలం ₹178 మొత్తాన్ని జీవనాధార వేతనంగా ప్రతిపాదించాయని ఆయన గుర్తు చేశారు. ఒకసారి ఇటువంటి తక్కువ స్థాయి వేతనాలు చట్టబద్ధమైతే, రాష్ట్రాలవారీగా ఉన్న కనీస వేతనాలను తగ్గించడానికి లేదా స్తంభింపజేయడానికి పెట్టుబడిదారులు వీటిని సాకుగా వాడుకుంటారని పేర్కొన్నారు. అలాగే, సమాన వేతన చట్టం ప్రకారం, స్త్రీ పురుష వివక్ష లేకుండా ఒకే రకమైన పని చేసే వారందరికీ సమాన వేతనం అందించాలి. అయితే, ఈ నిబంధనను కేవలం ఒకే కాంట్రాక్టర్ కింద పనిచేసే వారికి మాత్రమే పరిమితం చేయడం ఒక పెద్ద లొసుగుగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని, పెట్టుబడిదారులు వేర్వేరు కాంట్రాక్టర్ల ద్వారా మహిళలను అవ్యవస్థీకృత రంగంలోకి తీసుకుని, వారికి తక్కువ వేతనాలు చెల్లిస్తూ శ్రమ దోపిడీకి పాల్పడే అవకాశం ఉంది.
క్రమబద్ధమైన భౌతిక తనిఖీల స్థానంలో ‘ఫెసిలిటేటర్’ ఆధారిత వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఫ్యాక్టరీ తనిఖీలను ఈ కొత్త చట్టాలు బలహీనపరుస్తున్నాయని వివరించారు. ఇది పెట్టుబడిదారులకు ఉపశమనం కలిగిస్తుందని, కానీ కార్మికులను ప్రమాదంలోకి నెడుతుందని విమర్శించారు. ముఖ్యంగా ప్రమాదకర పరిశ్రమలలో, భోపాల్ గ్యాస్ దురంతం తర్వాత ఏర్పాటు చేసిన తప్పనిసరి సేఫ్టీ బోర్డులు మరియు కార్మికుల ప్రాతినిధ్యం వంటి రక్షణ కవచాలను ఇప్పుడు నీరుగార్చారని ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ లేబర్ కోడ్‌లు పని గంటలను పెంచి, కోర్ (ప్రధాన) పనులను కాంట్రాక్ట్ పద్ధతిలో నెట్టివేసి, వేతనాలను తగ్గించి పెట్టుబడిదారుల లాభాలను పెంచడానికి ఉద్దేశించినవని వాదించారు. బీజేపి-ఆర్ఎస్ఎస్ నేతృత్వంలోని ఫాసిస్ట్ శక్తులు మతం, ప్రాంతం మరియు భాషా పరంగా కార్మికులను విభజిస్తూ, పెట్టుబడిదారులకు సేవ చేస్తున్నాయని మజ్దూర్ బిగుల్ విమర్శించింది.
చివరగా, సమ్మెకు సంబంధించిన నిర్వచనాలను-నిబంధనలను కఠినతరం చేయడం ద్వారా, కార్మికుల సమిష్టి ప్రతిఘటనను అణచివేయడమే ఈ చట్టాల అసలు ఉద్దేశమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా జరుగుతున్న ఒక్క రోజు నామమాత్రపు సమ్మెలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదని చెప్తూ వ్యవస్థీకృత మరియు అవ్యవస్థీకృత రంగాలలోని కార్మికులందరూ నిరవధిక సార్వత్రిక సమ్మె కోసం ఏకం కావాలని మజ్దూర్ బిగుల్ పిలుపునిచ్చింది. నిరంతర ప్రతిఘటన లేకపోతే, బీజేపి ప్రభుత్వం పెట్టుబడిదారీ వర్గం కోసం ఈ చట్టాలను కనికరం లేకుండా అమలు చేస్తాయని, ఇది కార్మిక వర్గాన్ని మరింత చీకటిలోకి నెడుతుందని హెచ్చరించింది.
______________________________________________________________________

Mazdoor Bigul appealed to give a call for an Indefinite General Strike against four labour codes at AITUC meeting in Hyderabad.

Mazdoor Bigul attended AITUC Telangana State Council meeting in Himayatnagar, Hyderabad. This meeting was convened to raise awareness against the new four labour codes.
Suhas from Mazdoor Bigul explained that the new wage framework introduces a centrally fixed floor wage that can act as a low benchmark. He noted that earlier government committees projected figures around ₹178 per day as a subsistence-level wage. Once institutionalised, such low benchmarks can be used to freeze or push down minimum wages across States. It was also mentioned about how the wording was slyly manipulated in equal remunerations, where equal wages for different genders was only applicable for workers under the same contractor doing the same work. Hence a capitalist could hire male and female workers through separate contractors paying lesser wages for female workers.
It was explained how the labour laws weaken factory inspections by replacing regular physical checks with a facilitator-based, scheme-driven system. This was criticised as giving relief to capitalists while increasing risks for workers, especially in hazardous industries, where post‑Bhopal Gas tragedy safeguards like mandatory safety boards and worker representation have been diluted.
It was argued that the labour laws together promote longer working hours, contractualisation of core work, and wage suppression serving capitalist profits. Mazdoor Bigul located these changes within the Fascist BJP–RSS project of serving Capitalists while dividing the working class through religion, region, and language.
Finally, it was asserted that the intention of the new labour laws is to choke collective resistance by tightening strike definitions and procedures, making even limited protest actions illegal. Mazdoor Bigul stated the futility of decades of one-day strikes and appealed to all unions and workers (organised and unorganised) to unite around the call for an indefinite general strike, warning that without sustained resistance the BJP-led regime and the capitalist class will push these laws relentlessly, driving the working class into deeper darkness.