ఫాసిస్టు మోదీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నాలుగు కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్ లు పిలుపునిచ్చిన ఒకరోజు సమ్మెలో ఫిబ్రవరి 12న మజ్దూర్ బిగుల్ పాల్గొంది.
నాలుగు కార్మిక చట్టాలు కార్మికుల హక్కులపై అతిపెద్ద దాడి అని, నిరవధిక సార్వత్రిక సమ్మెకు సిద్ధం కావడమే పోరాడటానికి ఏకైక మార్గమని మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు అన్నారు. మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు కరపత్రాలను పంచి, నినాదాలతో, విప్లవాత్మక పాటల ద్వారా, ఆర్ట్ ద్వారా క్రూరమైన ఈ నాలుగు కార్మిక చట్టాలను రద్దు చేయాలనే డిమాండ్ను లేవనెత్తారు.ఫిబ్రవరి 12న సార్వత్రిక సమ్మెకు కేంద్ర కార్మిక సంఘాలు పిలుపునిచ్చినప్పటికీ, ఫాసిస్టు మోదీ ప్రభుత్వం వెనకడుగు వేయడం లేదని స్పష్టమవుతోందని బిగుల్ కార్యకర్తలు పేర్కొన్నారు. ట్రంప్-మోదీ ఒప్పందం సమయంలో ఫాసిస్టు ప్రభుత్వం లేబర్ కోడ్ ల గురించి చాల గొప్పగా పేర్కొన్నారు. బడ్జెట్ కు ముందర నిర్వహించిన ఆర్థిక సర్వేలో కూడా లేబర్ కోడ్లను సానుకూలంగా ప్రస్తావించారు. నాలుగు లేబర్ కోడ్ లను అమలు చేయాలని మోదీ ప్రభుత్వం నిశ్చయించుకున్నట్లు స్పష్టమవుతోంది. ఇప్పుడు ఫాసిస్టు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి ఏకైక మార్గం శ్రామిక ప్రజల ఆయుధాన్ని ఉపయోగించడం, నిరవధిక సాధారణ సమ్మె చేపట్టడం, నాలుగు కార్మిక కోడ్ లను రద్దు చేసే వరకు ఉత్పత్తిని నిలిపివేయడం.
ఈ కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా గత కొన్ని నెలలుగా బిగుల్ చేపట్టిన ప్రచారాల సమయంలో స్పష్టమైనట్లుగా దేశంలోని కార్మికులు మరియు ఉద్యోగులు ఖచ్చితంగా నిరవధిక సార్వత్రిక సమ్మె కోసం తమ పూర్తి మద్దతును అందిస్తారు.
నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలి !
నిరవధిక సాధారణ సమ్మె ఒక్కటే మార్గం!
_______________________________________________________________________________________
On 12 February, Mazdoor Bigul participated in the one-day strike called by the Central Trade Unions against the four anti-worker labour codes introduced by the fascist Modi government.
Mazdoor Bigul activists highlighted the fact that the four labour laws have been the biggest attack on the rights of workers, and that the only way forward is to prepare for an indefinite general strike. Mazdoor Bigul activists distributed pamphlets, raised slogans, sang revolutionary songs, and, through artwork, raised the demand to repeal the draconian four labour laws.
Bigul activists mentioned that despite this call for a general strike on Feb 12th being announced by the Central Trade Unions, it is clear that the fascist Modi government is not relenting. The fascist government spoke highly of the labour codes during the Trump – Modi deal. Even in the economic survey carried out before the budget, the labour codes were mentioned positively. It is clear that the Modi government is determined to implement the four labour codes. The only way to pressurise the fascist government now is to use the weapon of the working masses, to take up an indefinite general strike and stop production until the four labour codes are repealed.
The workers and employees in the country will certainly extend their total support as was clear during the campaigns undertaken by Bigul in the last few months against these draconian labour codes.
Repeal four labour codes !
Indefinite general strike is the only way forward !













Recent Comments