English Text Below
కార్మిక-ఉద్యోగ వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్‌లను రద్దు చేయాలి!
శుక్రవారం, డిసెంబర్ 12వ తారీఖున విశాఖపట్నంలోని పోస్టల్, టెలికామ్ ఉద్యోగుల మధ్య, విజయవాడలోని రైల్వే కార్మికుల మధ్య నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు ప్రచారం నిర్వహించారు.
నవంబర్ 21న ఫాసిస్టు మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్లను అమలుచేస్తున్నామని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. ప్రజలంతా కోవిడ్ తో సతమతమవుతున్న తరుణంలో 2020లోనే ఈ కోడ్లు పార్లమెంటులో చట్టరూపం తీసుకున్నాయి. అయితే, వీటి అమలు వల్ల ప్రజలలో తీవ్రమైన వ్యతిరేకత వస్తుందేమో అన్న భయంతో మోదీ ప్రభుత్వం ఇన్నాళ్ళూ వీటి అమలును వాయిదా వేస్తూ వచ్చింది. గత నెల బీహార్ ఎన్నికల్లో విజయం సాధించాక, సరైన సమయం చూసుకుని వీటి అమలుకు నోటిఫికేషన్ ఇచ్చింది. కొన్ని దశాబ్దాలుగా కార్మికులు ఎన్నో త్యాగాలు చేసి, పోరాడి సాధించుకున్న కార్మిక చట్టాలు ఈ దెబ్బతో నిర్వీర్యం అయిపోయాయి. ఈ నాలుగు కోడ్లు కార్మికుల హితం కోసమేనని, శ్రమయేవ జయతే అని మోదీ ప్రభుత్వం తమ గోదీ మీడియా సాయంతో ఊదరగొడుతోంది. వాస్తవానికి పడిపోతున్న తమ పెట్టుబడిదారీ ఓనర్ల లాభాలను పెంచేందుకే మోదీ ప్రభుత్వం ఈ చర్యలు తీసుకుందని బిగుల్ కార్యకర్తలు ఈ సందర్భంగా కార్మికులకు, ఉద్యోగులకు వివరించారు.
ఇన్నాళ్ళూ పనిగంటలు, కనీస వేతనాలు, పని ప్రదేశాలలో భద్రత, కార్మికుల సామాజిక భద్రత వంటి విషయాలలో కనీసం పేపర్ మీదనైనా కొన్ని చట్టాలు ఉండేవి. సంఘటిత రంగంలో కొంత మేరకు అవి అమలయినా, అసంఘటిత రంగంలో అసలు అమలయ్యేవి కావు. అయితే, కార్మిక హక్కులకు చట్టబద్ధత ఉండడంతో, సంఘటితమై పోరాడిన సమయాల్లో అసంఘటితరంగకార్మికులు కూడా ఆ చట్టాలను తమకు అనుకూలంగా అమలు జరిపించుకోగలిగేవారు. ఇప్పుడు లేబర్ కోడ్ల అమలుతో మోదీ ప్రభుత్వం ఈ హక్కులకు చట్టబద్ధతే లేకుండా చేసింది అని బిగుల్ కార్యకర్తలు వివరించారు.
ఇందుకు ఎనిమిది-గంటల పనిదినమే ఒక ఉదాహరణ. 140 ఏళ్ళ క్రితం కార్మికవర్గం చేసిన అసామాన్య త్యాగాల ఫలితం ఈ హక్కు. గత కొంత కాలంగా ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటి భారత పెట్టుబడిదారులు దేశాభివృద్ధి కోసం కార్మికులు, ఉద్యోగులు రోజుకు పది నుండి పన్నెండు గంటలు పని చేయాలని వ్యాఖ్యానిస్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఎనిమిది గంటల పనిదినానికి ఈ కోడ్లు చరమగీతం పాడాయి. ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ అనే పేరుతో కాంట్రాక్టు పద్ధతిని చట్టబద్ధం చేసేశారు. ఇన్నాళ్ళూ, పర్మనెంట్ స్వభావం ఉన్న పనుల్లో పర్మనెంట్ ఉద్యోగులను నియమించాలనే చట్టం ఉండేది, ఇప్పుడు లేబర్ కోడ్ ల అమలుతో ఈ హక్కూ మాయమైంది. ఈ రకంగా పర్మనెంట్ ఉద్యోగాలకు పర్మనెంట్ గా మంగళం పాడేస్తున్నారని బిగుల్ కార్యకర్తలు కార్మికులకు, ఉద్యోగులకు వివరించారు.కార్మికులు, తమ హక్కుల సాధన కోసం సమ్మేళను చేయడాన్ని కూడా కష్టతరం చేశారన్నారు.
ఈ లేబర్ కోడ్లు, స్వాతంత్ర్యానంతరం భారత కార్మికవర్గంపై జరుగుతున్న అతిపెద్ద దాడి అని, ఇటువంటి దాడిని ఎదుర్కోవడానికి భారత కార్మికవర్గం కూడా త్యంత శక్తివంతమైన ఆయుధాన్ని ప్రయోగించాల్సి ఉంటుందని అన్నారు. నిరవధిక సార్వత్రిక సమ్మె ఒక్కటే, ఈ లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేలా ఫాసిస్టు మోదీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురాగలదని వివరించారు. గత ముప్పై ఏళ్ళుగా చేసిన ఒక్కరోజు, రెండ్రోజుల సమ్మెల వల్ల ఉపయోగం ఏదీ జరగకపోగా, ఈ కాలంలో కార్మికుల హక్కులు మరింత దిగజారాయన్నారు. ఈ కాలంలో కార్మికుల ఉద్యోగ భద్రత తీవ్రమైన సంక్షోభంలో పడింది, కాంట్రాక్ట్ పద్ధతి, క్యాజువల్ పద్ధతి తీవ్రంగా పెరిగాయి, పనిగంటలు పెరిగాయి తప్ప తాగలేదు. కాబట్టి సంఘటితరంగ కార్మికులు, అసంఘటితరంగ కార్మికులు అన్న భేదం లేకుండా భారత కార్మికవర్గమంతా ఏకమై ఈ లేబర్ కోడ్లను తిప్పికొట్టాలని, ఫాసిస్టు మోదీ ప్రభుత్వం తన లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేవరకూ నిరవధిక సమ్మె చేయాలని పిలుపిచ్చారు. ఈ పిలుపు అందుకునేలా తమ యూనియన్ నాయకత్వంపై కూడా ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు.
ఈ ప్రచారానికి కార్మికులు, ఉద్యోగుల మధ్య చాలా మంచి స్పందన లభించింది. భవిష్యత్తులో ఈ క్యాంపెయిన్ మరిన్ని పట్టణాలలో మరింత విస్తృతంగా జరుగుతుంది.
——————
Repeal the four anti-worker, anti-employee Labour Codes!

On Friday, December 12, Mazdoor Bigul activists along with members of Naujawan Bharat Sabha (NBS) carried out a campaign against the four Labour Codes among postal and telecom employees in Visakhapatnam, and among railway workers in Vijayawada.
It is well known that on November 21 the fascist Modi government announced the implementation of the anti-worker four Labour Codes. These codes were passed into law by Parliament back in 2020, at a time when people were reeling under the impact of COVID. However, fearing strong public opposition once they were implemented, the Modi government bided its time. After winning the Bihar elections last month, it chose what it considered the right moment and issued the notification to implement them. As a result, labour laws that workers had won over several decades through immense sacrifices and struggles have now been rendered ineffective. The Modi government, with the help of its pliant “godi media,” is loudly claiming that these four codes are in the interest of workers and chanting lofty slogans like “Shramayeva Jayate.” In reality, the Bigul activists explained to workers and employees that these measures have been taken solely to increase the profits of the capitalist owners whose returns have been declining.
Until now, there were at least some laws on paper concerning working hours, minimum wages, workplace safety, and workers’ social security. While these were implemented to some extent in the organised sector, they were hardly implemented at all in the unorganised sector. Nevertheless, since workers’ rights had legal recognition, even unorganised sector workers were sometimes able to get these laws enforced in their favour when they organised and struggled. With the implementation of the Labour Codes, the Modi government has stripped these rights of any legal basis, Bigul activists explained.
The eight-hour working day is one such example. This right is the result of extraordinary sacrifices made by the working class 140 years ago. In recent times, Indian capitalists like Infosys’s Narayana Murthy have been making statements that workers and employees should work ten to twelve hours a day for the country’s development. In line with this thinking, these Labour Codes have sounded the death knell for the eight-hour working day. Under the name of “fixed-term employment,” the contract system has been legalised. Earlier, there was a law requiring that permanent jobs be filled by permanent employees; with the implementation of the Labour Codes, even this right has disappeared. In this way, the activists explained, permanent employment itself is being permanently dismantled. They also pointed out that workers’ ability to organise and go on strike to secure their rights has been made more difficult.
The activists stated that these Labour Codes constitute the biggest attack on the Indian working class since Independence, and that to confront such an attack the working class must deploy its most powerful weapon. Only an indefinite general strike, they explained, can put enough pressure on the fascist Modi government to force it to withdraw these Labour Codes. They noted that one-day or two-day strikes over the past thirty years have achieved nothing; instead, workers’ rights have further deteriorated during this period. Job security has fallen into a severe crisis, contract and casual employment have grown sharply, and working hours have increased without any reduction. Therefore, they called upon the entire working class of India, organised and unorganised sector workers, to unite and carry out an indefinite strike until the fascist Modi government withdraws its four labour codes. They also appealed to workers to exert pressure on their own union leaderships to take up this call.
Workers and employes received this campaign very positively. This campaign will be carried out much more extensively in more towns across the State in the following months.