గురువారం, జనవరి 22న విశాఖపట్నంలోని పెదవాల్తేరు బస్ డిపో వద్ద మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు నాలుగు కొత్త లేబర్ కోడ్స్‌కి వ్యతిరేకంగా ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు.
కార్మికుల హక్కులకి గ్యారంటీ ఇస్తున్నామంటూ ఫాసిస్టు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన ఈ లేబర్ కోడ్‌లు, వాస్తవానికి పెట్టుబడిదారులు కార్మికులను మరింత దోపిడీ చేయడానికి, పడిపోతున్న తమ లాభాలను పెంచుకోవడానికే ఉపయోగపడతాయని వివరించారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి వంటి పెట్టుబడిదారులు భారత యువత వారానికి 70 గంటలు పనిచేయాలనడానికీ ప్రభుత్వం లేబర్ కోడ్ల ద్వారా పనిగంటలు పెంచడానికీ మధ్య స్పష్టమైన సంబంధం ఉందన్నారు.
పర్మనెంట్ ఉద్యోగాలను పర్మనెంట్ గా లేకుండా చేసే కుట్ర లేబర్ కోడ్‌ల ద్వారా వాస్తవరూపం దాలుస్తోందన్నారు. ‘ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్‌మెంట్ వంటి అందమైన పదబంధాల ద్వారా కాంట్రాక్టీకరణని చట్టబద్ధం చేసేస్తున్నారని వివరించారు. ఇన్నాళ్ళూ ఏదో ఒక రూపంలో కార్మికులకీ, యజమానులకీ మధ్య ఒక మధ్యవర్తి పాత్ర పోషించిన ప్రభుత్వం ఈ కోడ్‌లతో యాజమానుల పనిని సులువు చేసే ఫెసిలిటేటర్ పాత్రకే పరిమితమవబోతోంది. ఆఖరికి తమ హక్కులు సాధించుకునేందుకు కార్మికులకు ఉన్న యూనియన్లు ఏర్పాటు చేసుకునే హక్కు, సమ్మె చేసే హక్కులను కూడా ఈ లేబర్ కోడ్‌లు నిర్వీర్యం చేసేస్తున్నాయి.
స్వాతంత్ర్య భారతదేశంలో కార్మికవర్గంపై జరుగుతున్నా అతిపెద్ద దాడి ఇది. ఇటువంటి దాడిని మన వద్ద ఉన్న అత్యంత శక్తిమంతమైన ఆయుధంతో ఎదుర్కొనకపోతే భవిష్యత్ తరాలు అంధకారంలో కూరుకుపోక తప్పదు. కాబట్టి ఈ ఫాసిస్టు మోదీ ప్రభుత్వం కార్మిక-వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్ లను వెనక్కి తీసుకునేవరకు నిరవధిక సార్వత్రిక సమ్మెకి పూనుకోవాలని బిగుల్ కార్యకర్తలు కార్మికులను కోరారు. ముప్పైయేళ్ళుగా చేసిన ఒకట్రెండు రోజుల సమ్మెలు పెరుగుతున్న కాంట్రాక్టీకరణ, ప్రయివేటీకరణ విధానాలపై ఎటువంటి ప్రభావమూ చూపలేదు. ఈరోజు కూడా అటువంటి సమ్మె ప్రభావం చూపదు. కాబట్టి ఫిబ్రవరి 12న సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ పిలుపిచ్చిన ఒకరోజు సమ్మెను నిరవధిక సమ్మెగా మార్చేందుకు తమ యూనియన్ల నాయకత్వంపై ఒత్తిడి తీసుకురావాలని బిగుల్ కార్యకర్తలు కార్మికులను కోరారు.
ఈ సందర్భంగా కార్మికుల నుండి కూడా మంచి స్పందన లభించింది. కొన్నేళ్ళుగా ఆర్టీసీలో జరుగుతున్న కాంట్రాక్టీకరణ గురించి, నిరవధిక సమ్మె అవసరం గురించి వారు బిగుల్ కార్యకర్తలతో చర్చించారు.
————————

On Thursday, January 22, Mazdoor Bigul activists conducted a campaign against the four new labour codes at the APSRTC Bus Depot, Pedawaltair in Visakhapatnam.
They explained to the workers that these labour codes, which the fascist Modi government claims will guarantee workers’ rights, are in reality meant to enable capitalists to further exploit workers and increase their falling profits. They pointed out the clear connection between capitalists like Infosys’s Narayana Murthy calling for Indian youth to work 70 hours a week and the government increasing working hours through the labour codes.
They said that the conspiracy to eliminate permanent jobs is taking concrete shape through the labour codes. Under attractive phrases such as “fixed-term employment,” contract work is being legalised. So far, the government had played, in one form or another, an intermediary role between workers and capitalists; through these codes, it will be reduced to the role of a mere facilitator that makes things easier for the capitalists. These labour codes are also crippling workers’ rights to form unions and to go on strike in order to fight for their rights.
This is the biggest attack on the working class in independent India. If such an attack is not confronted with the most powerful weapon available to us, future generations will inevitably be pushed into darkness. Therefore, Mazdoor Bigul activists called upon workers to take up an indefinite general strike until the fascist Modi government withdraws the four anti-worker labour codes. One- or two-day strikes conducted over the past thirty years have had no impact on the growing policies of contractualisation and privatisation, and even today such strikes will not make any difference. Hence, the activists urged workers to put pressure on their union leaderships to turn the one-day strike called by the central trade unions on February 12 into an indefinite general strike.
On this occasion, there was also a good response from the workers. They discussed with Bigul activists the contractualisation that has been taking place in the RTC for several years and the need for an indefinite strike.