హైదరాబాద్‌లోని జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని కార్మికుల బస్తీలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా కార్మికుల చర్చా కార్యక్రమం
మార్చి 8 న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మజ్దూర్ బిగుల్ జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతంలోని రామిరెడ్డి నగర్‌లో కార్మికుల చర్చా కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో మహిళా దినోత్సవానికి సంబంధించిన చారిత్రక మహిళా కార్మిక పోరాటాలు, ప్రస్తుత కాలంలో మహిళా కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యల గురించి చర్చ జరిగింది.
మజ్దూర్ బిగుల్ తరఫున భార్గవి మాట్లాడుతూ, నేటి నుంచి 116 సంవత్సరాల క్రితం 1910లో నిర్వహించిన అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సులో మహిళా విముక్తి పోరాటం, శ్రామిక ప్రజల నాయకురాలైన క్లారా జెట్కిన్ ప్రపంచవ్యాప్తంగా శ్రామిక మహిళల విప్లవాత్మక ఐక్యతకు ప్రతీకగా మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకోవాలని ప్రతిపాదించినట్టు తెలిపారు. ఆ తరువాత నుంచి మార్చి 8 ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. ఈ చారిత్రక పోరాటం నేటికీ ప్రస్తుత సమస్నుయలను ఎదుర్కొనే ప్రేరణను మనకు ఇస్తుంది.
ప్రస్తుత పెట్టుబడిదారీ సమాజంలో మహిళలు ద్వంద్వ బానిసత్వాన్ని అనుభవించాల్సి వస్తుంది. ఫ్యాక్టరీలో వారు దోపిడీని ఎదుర్కొంటారు, మరోవైపు సామాజిక అసురక్షితను కూడా భరించాల్సి వస్తోంది. మోదీ ప్రభుత్వపు ‘బేటీ బచావో, బేటీ పడావో’ అనే తప్పుడు నినాదం యొక్క అసలు స్వరూపం ఇప్పుడు బయటపడింది. ఒకవైపు మహిళలపై జరిగే నేరాలు నిరంతరం పెరుగుతున్నాయి, మరో వైపు స్వయంగా బీజేపీ నాయకుల చేతనే మహిళలపై జరిగిన నేరాలు కూడా రెట్టింపు అవుతున్నాయి. ఇంకో వైపు పెట్టుబడిదారీల సేవలో మోదీ ప్రభుత్వం నాలుగు లేబర్ కోడ్ లను అమలు పరుస్తుంది. వీటి ద్వారా కార్మికుల హక్కులను అన్నింటినీ హరించి, పెట్టుబడిదారీలకు తమ లాభాలను పెంచుకునే చట్టబద్ధమైన అవకాశాన్ని కల్పిస్తోంది. ఎటువంటి భద్రత హామీ లేకుండా మహిళా కార్మికులతో నైట్ షిఫ్ట్‌లలో పని చేయించబడుతుంది.
ఒకే విధమైన పనికి పురుషుల కంటే మహిళా కార్మికులకు తక్కువ వేతనం ఇస్తున్నారని చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు చెప్పారు. అలాగే బస్తీలో పిల్లలను ఎత్తుకుపోయే కేసులు పెరుగుతున్నాయని, అందువల్ల పిల్లలను ఇంట్లో వదిలి పనికి వెళ్లడం చాలా కష్టంగా మారిందని తెలిపారు. ఫ్యాక్టరీలో 8 నుంచి 10 గంటల పని చేసిన తరువాత ఇంటి పనులు చేయడంలో ఎదురయ్యే కష్టాలను కూడా వారు పంచుకున్నారు.
ఈ సమస్యలపై మాట్లాడుతూనే కార్మిక హక్కుల చరిత్రలో మైలురాయి అయిన 1917 అక్టోబర్ విప్లవం తరువాత మహిళల జీవితాల్లో వచ్చిన మార్పుల గురించి చర్చించారు. కార్మిక వర్గ నాయకత్వంలో మహిళలకు సామాజిక, ఆర్థిక హక్కులు లభించాయి. సామూహిక క్రెష్, సామూహిక వంటశాలలు, పిల్లల సంరక్షణ, ఉపాధిలో సమానత్వం, విద్య, మాతృత్వ ప్రయోజనాలు, చట్టపరమైన హక్కులు మహిళల స్వాతంత్య్రాన్ని, సమాజంలో సమానత్వాన్ని నిర్ధారించడానికి అమలు చేయబడ్డాయి. దీనితో మహిళలు నిజమైన అర్థంలో స్వేచ్ఛను పొందారు, పురుషులతో భుజం భుజం కలిపి సోషలిస్టు సమాజ నిర్మాణంలో భాగస్వాములయ్యారు.
భార్గవి మాట్లాడుతూ, నేడు మహిళలు తమ విముక్తి పోరాటాన్ని పెట్టుబడిదారీ వ్యవస్థకు వ్యతిరేకంగా జరుగుతున్న విస్తృత పోరాటంతో జోడించాలని, కార్మిక వర్గ ఐక్య బలంతోనే పెట్టుబడిదారీ వ్యవస్థను కూలదోసి సోషలిస్టు సమాజం కోసం పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లాలని తెలిపారు. తద్వారా ఫ్యాక్టరీలు, పొలాలు కొద్ది పరాన్నజీవులైన పెట్టుబడిదారుల చేతుల్లో కాకుండా శ్రమజీవుల ఆధీనంలోకి రావాలని అన్నారు.
చర్చా కార్యక్రమం ముగింపులో ‘మహిళాయే ఉఠీ నహి తో’ అనే పాటను పాడారు. కార్యక్రమంలో పాల్గొన్న మహిళలు ఇలాంటి చర్చలను తరచు నిర్వహించి తమకు తెలియచేయమని అన్నారు.
______________________________________________________________________

हैदराबाद के जीडीमेटला औद्योगिक क्षेत्र की मज़दूर बस्ती में अंतरराष्ट्रीय स्त्री दिवस के अवसर पर मज़दूर बैठकी।
मज़दूर बिगुल ने 8 मार्च, अंतरराष्ट्रीय स्त्री दिवस के अवसर पर जीडीमेटला औद्योगिक क्षेत्र के रामी रेड्डी नगर में मज़दूर बैठकी आयोजित की। इस बैठकी में स्त्री दिवस के ऐतिहासिक स्त्री मज़दूर संघर्ष और आज के दौर में स्त्री मज़दूरों के सामने मौजूद चुनौतियों पर बातचीत की गई।
मज़दूर बिगुल की ओर से भार्गवी ने बताया कि आज से 111 साल पहले 1910 में आयोजित अंतरराष्ट्रीय समाजवादी स्त्री सम्मेलन में स्त्री मुक्ति संघर्ष और मेहनतकश अवाम की नेता क्लारा जेटकिन ने दुनिया भर की मेहनतकश औरतों की क्रांतिकारी एकजुटता के प्रतीक के रूप में 8 मार्च को अंतरराष्ट्रीय स्त्री दिवस के तौर पर मनाने का प्रस्ताव रखा था। उसके बाद से यह पूरी दुनिया में प्रचलित हो गया। यह ऐतिहासिक संघर्ष एक जलती हुई मशाल की तरह आज भी हमें मौजूदा चुनौतियों से लड़ने की प्रेरणा देता है।
आज के पूँजीवादी समाज में औरतों को दोहरी गुलामी की मार झेलनी पड़ रही है। फ़ैक्ट्री में उन्हें शोषण का सामना करना पड़ता है, वहीं दूसरी तरफ सामाजिक असुरक्षा भी झेलनी पड़ती है। मोदी सरकार का झूठा ‘बेटी बचाओ, बेटी पढ़ाओ’ के खोखले नारे की असलियत अब उजागर हो चुकी है। एक तरफ़ स्त्री-विरोधी अपराध लगातार बढ़ रहे हैं और बीजेपी के नेताओं द्वारा ही औरतों के विरुद्ध किए गए अपराध भी आसमान छू रहे हैं। वहीं दूसरी तरफ पूँजीपतियों की सेवा में मोदी सरकार चार लेबर कोड ला रही है। इसके ज़रिए पूँजीपतियों को क़ानूनी तौर पर मज़दूरों के अधिकारों को ताक पर रखकर अपना मुनाफा बढ़ाने की छूट दी जा रही है। स्त्री मज़दूरों से बिना किसी सुरक्षा की गारंटी के नाइट शि़फ़्ट में काम करवाया जाएगा।
बैठकी में औरतों ने बताया कि एक ही जैसे काम के लिए स्त्री मज़दूरों को पुरुषों की अपेक्षा कम मज़दूरी मिलती है। उन्होंने यह भी बताया कि बस्ती में बच्चों के अपहरण के मामले बढ़ते जा रहे हैं, जिसके कारण बच्चों को घर पर छोड़कर काम पर जाना बेहद मुश्किल हो गया है। फ़ैक्ट्री में 8 से 10 घंटा काम के बाद घर का काम करने के मुश्किलों को भी साझा किया।
इन समस्याओं पर बात रखते हुए मज़दूर इतिहास के मिल के पत्थर 1917 के अक्टूबर क्रान्ति के बाद औरतों के जीवन में हुए बदलाव पर बात की गई। मज़दूर वर्ग के नेतृत्व में औरतों को सामाजिक व आर्थिक अधिकार मिले। सामुदायिक क्रेच, रसोई, बाल देखभाल, रोजगार में समानता, शिक्षा, मातृत्व लाभ और कानूनी अधिकार औरतों की स्वतंत्रता और समाज में बराबरी सुनिश्चित करने के लिए लागू किए गए जिससे औरतें सही मायने में आज़ाद हुईं और मर्दों से कन्धे से कन्धा मिलाते हुए समाजवादी समाज के निर्माण में शामिल हुई थीं।
भार्गवी ने बताया कि आज औरतों को अपनी मुक्ति की लड़ाई को पूँजीवादी व्यवस्था के ख़िलाफ़ चल रही व्यापक लड़ाई से जोड़ना होगा और मज़दूर वर्गीय एकता के दम पर ही पूँजीवादी व्यवस्था को ध्वस्त करके समाजवादी समाज की लड़ाई को आगे बढ़ाना होगा ताकि फ़ैक्ट्रियों और खेल-खलिहानों पर मुट्ठी पर परजीवी पूँजीपतियों के बजाय मेहनतश लोगों का क़ब्ज़ा हो सके।
बैठकी का समापन ‘महिलाएँ अब उठी नहीं तो’ गीत गा कर किया गया। बैठकी में मौजूद औरतों ने ऐसी बैठकियाँ नियमित रूप से आयोजित करने की बात भी की।