Telugu Text Below
On February 2 and 3, Mazdoor Bigul activists carried out a campaign against the labour codes among the workers and employees of Road & Transport at Zonal RTC workshop, Bhavanipuram and at PNBS bustand in Vijayawada.
Therefore, it is time for organised and unorganised workers and employees to fight unitedly. They called upon all to unite and call for an indefinite general strike and continue it indefinitely till the four labour codes are repealed.
The activists also appealed to the workers and employees to put pressure on their respective unions to convert the one-day strike called by the central trade unions on February 12 into an indefinite strike. They appealed to the workers to participate in the strike and extend all possible support.
______________________________________________________________________
______________________________________________________________________
ఫిబ్రవరి 2, 3 తేదీల్లో నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా విజయవాడలో మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు పండిట్ నెహ్రు బస్టాండ్ వద్ద, భవానీపురంలో జోనల్ RTC వర్క్ షాప్ వద్ద ఉన్న కార్మికుల, ఉద్యోగుల మధ్య ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈ నాలుగు లేబర్ కోడ్లు కార్మికులను-ఉద్యోగులను పెట్టుబడిదారులు మరింత దోపిడీ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తుంది అని కార్యకర్తలు వివరించారు. ఈ లేబర్ కోడ్లు అమలు అయితే కార్మికులకు ఉండే కొద్దిపాటి హక్కులు కూడా అంతం అవుతాయని వివరించారు.
అందుకని సంఘటిత, అసంఘటిత కార్మికులు- ఉద్యోగులు సంఘటితమై పోరాడాల్సిన తరుణం ఇది. అందరూ ఏకమై నిరవధిక సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వాలని, ఈ నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేసేవరకు నిరవధికంగా సమ్మెను కొనసాగించాలి అని పిలుపునిచ్చారు.
అదే విధంగా ఫిబ్రవరి 12న సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు పిలుపిచ్చిన ఒకరోజు సమ్మెను నిరవధిక సమ్మెగా మార్చేలా తమతమ యూనియన్లపై ఒత్తిడి తీసుకురావాలని కార్మికులకు, ఉద్యోగులకు విజ్ఞప్తి చేశారు. ఈ సమ్మెలో పాల్గొనడంతో పాటు సాధ్యమైనన్ని రకాలుగా మద్దతు పలకాలని కార్యకర్తలు విజ్ఞప్తి చేశారు.














Recent Comments