English Text Below
మార్చి 25, విజయవాడలోని విద్యాధరపురం RTC డిపో వర్క్ షాప్ వద్ద మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు నాలుగు లేబర్ కోడ్స్ వ్యతిరేక క్యాంపెయిన్ నిర్వహించారు. లేబర్ కోడ్స్ కి వ్యతిరేకంగా ఫిబ్రవరి 12న సెంట్రల్ ట్రేడ్ యూనియన్లు ఇచ్చిన ఒకరోజు సమ్మె జరిగిన తీరును, దాని ఫలితాన్ని మూల్యాంకనం చేసుకుని, మోదీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ వెనక్కి తీసుకునే వరకూ నిరవధిక సార్వత్రిక సమ్మె కోసం ఏకం కావాలని కార్మికులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు.
ఈ సమ్మె జరిగిన తీరు కారణంగా కార్మికులు, ఉద్యోగుల్లో నిరాశ ఎక్కువైంది. కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వం పట్ల వారి అసంతృప్తి పెరిగింది. మరే ఇతర దేశవ్యాప్త రాజకీయ నాయకత్వం గానీ, ప్రత్యామ్నాయం గానీ లేకపోవడంతో వారు ధైర్యం కోల్పోతున్నారు. ముందుకెళ్ళే దారేదీ వారికి కనిపించడం లేదు. ఇటువంటి పరిస్థితుల్లో మనం ఏం చేయాలి అనేది కార్యకర్తలు ఉద్యోగులతో మాట్లాడారు. ఒకవైపు మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా నిరవధిక సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వాలని కేంద్ర కార్మిక సంఘాల నాయకత్వంపై క్రమపద్ధతిలో ఒత్తిడి తీసుకురావాలి. ఇది లేకుండా లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునేందుకు, ఉపాధి హామీ (MNREGA) చట్టాన్ని రద్దు చేసే కుట్రని ఆపేందుకు అవసరమైన ఒత్తిడి తీసుకురాలేమని కార్యకర్తలు ఉద్యోగులకు వివరించారు.
అంతే కాకుండా దీన్ని చిన్న విషయంగా పరిగణించవద్దని, మోదీ ప్రభుత్వం ఈ నాలుగు లేబర్ కోడ్లను అమలు చెయ్యడానికి కేవలం కొద్ది రోజులు మాత్రమే ఉందని కాబట్టి లేబర్ కోడ్ల వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనమని ఉద్యోగులకు, కార్మికులకు కార్యకర్తలు పిలుపినిచ్చారు.
—————
On March 17, Mazdoor Bigul activists conducted a campaign against the four Labour Codes at the Vidyadharapuram RTC depo workshop in Vijayawada. Assessing the way the one-day nationwide strike called by the Central Trade Unions on February 12 against these Labour Codes was carried out and its outcome, they appealed to workers and employees to unite for an indefinite general strike until the Modi government withdraws the Labour Codes.
The strike has left employees and workers more dissatisfied. Their dissatisfaction with the leadership of the central trade unions grew. They’re losing courage due to the lack of nationwide political leadership or an alternative. They don’t see a way forward. The activists spoke them what should we do in such situations. On one hand, the leadership of the central trade unions should be systematically pressured to call for an indefinite general strike against the four anti-worker labour codes introduced by the Modi government. Activists explained to employees that without this, they wouldn’t be able to build necessary pressure to withdraw Labour Codes and to stop the conspiracy to repeal the Employment Guarantee Act (MNREGA).
Activists also appealed to employees and workers not to take this lightly and join the movement against labour codes, as the Modi government has only a few days left to implement these four labour codes.













Recent Comments