Scroll down for English
మార్చి 6న హైదరాబాదులో మజ్దూర్ బిగుల్ కార్యకర్తలు జీడిమెట్ల పారిశ్రామిక ప్రాంతం ఎగ్జిట్ వద్ద నాలుగు లేబర్ కోడ్ లకు వ్యతిరేకంగా ప్రచారం నిర్వహించారు.
ప్రచారంలో బిగుల్ కార్యకర్తలు కార్మికులతో మాట్లాడి, ఫాసిస్టు మోదీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక, పెట్టుబడిదారీ అనుకూల లేబర్ కోడ్ ల గురించి వివరించారు. ఈ చట్టాలు కార్మికులు కష్టపడి సంపాదించిన హక్కులపై ఎలా దాడి చేస్తున్నాయో వివరించారు. ఫిక్స్డ్-టర్మ్ ఎంప్లాయ్మెంట్ ద్వారా కాంట్రాక్టు విధానాన్ని ప్రోత్సహిస్తూ, ఉద్యోగ భద్రతను బలహీనపరుస్తూ కార్మికులను మరింత దోపిడీకి గురిచేస్తున్నాయని వాళ్ళు చెప్పారు.
అలాగే ప్రభుత్వం కనీస వేతనాల స్థానంలో రోజుకు సుమారు ₹178 (అంటే నెలకు సుమారు ₹5000) మాత్రమే ఉండే “ఫ్లోర్ వేజ్” విధానాన్ని తీసుకురావాలని చూస్తుందని, అది ఒక కార్మికుడు తన కుటుంబాన్ని పోషించడానికి సరిపోదని కార్యకర్తలు తెలిపారు. వాస్తవానికి పరిశ్రమల ప్రాంతాల్లో చాలా మంది కార్మికులు ఇప్పటికే రోజుకు 10–12 గంటలు పని చేయాల్సి వస్తోందని, అధికారికంగా పని గంటలు 8 గంటలే అయినప్పటికీ సరైన ఓవర్‌టైమ్ వేతనం లేకుండా పని చేయాల్సి వస్తోందని చెప్పారు. ఈ లేబర్ కోడ్ లు అమల్లోకి వస్తే పని గంటలు 12–14 గంటలకు కూడా పెరిగే ప్రమాదం ఉందని వారు హెచ్చరించారు. కొత్త చట్టాల వల్ల ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత పాలసీలు, పని ప్రదేశాల్లో భద్రత కూడా బలహీనపడుతున్నాయని వారు చర్చించారు.
చాలా మంది కార్మికులు, రోజువారీ కూలీలు తమ అనుభవాలను పంచుకున్నారు. ఎక్కువ పని గంటలు, ఓవర్‌టైమ్ వేతనం లేకపోవడం, సరైన పని పరిస్థితులు లేకపోవడం వంటి సమస్యలను వారు వివరించారు. ఈ ప్రాంతంలో పనిచేస్తున్న కార్మికుల్లో ఎక్కువమంది మహిళలే ఉన్నారు.
రోజుకు పని గంటలను ఆరు గంటలకు తగ్గించాలని, నెలకు కనీసం ₹30,000 వేతనం హామీ ఇవ్వాలని, పురుష, మహిళా కార్మికులకు సమాన వేతనం ఉండాలని కార్యకర్తలు డిమాండు చేసారు. నాలుగు కార్మిక కోడ్ లను పూర్తిగా రద్దు చేయాలని కూడా వారు స్పష్టం చేసారు. ఒకరోజు సమ్మెలతో ఏమీ సాధ్యం కాదని, ఈ చట్టాలను రద్దు చేయించడానికి కార్మికులు విస్తృతమైన పోరాటానికి ఐక్యమవ్వాలని, నిరవధిక సాధారణ సమ్మె మాత్రమే దీనికి మార్గమని చెప్పారు. అనేక మంది కార్మికులు శ్రద్ధగా విని కార్యకర్తలు పంచిన పాంప్లెట్లు తీసుకున్నారు.
రాబోయే రోజుల్లో కూడా మజ్దూర్ బిగుల్ సంఘటిత, అసంఘటిత రంగాల కార్మికులు, ఉద్యోగుల మధ్య ఇటువంటి ప్రచార కార్యక్రమాలను కొనసాగించనుంది.
______________________________________________________________________

On March 6 Mazdoor Bigul activists in Hyderabad campaigned against the four labour codes near Jeedimetla industrial area exit.
During the campaign, Bigul activists spoke with workers about the anti-worker, pro-capitalist labour codes brought by the fascist Modi government and explained how these laws attack the hard earned rights of workers. The activists explained that the labour codes promote contractualisation through fixed-term employment weakening job security and making workers more vulnerable to exploitation. They also highlighted how the government is replacing minimum wages with a “floor wage” of around ₹178 per day, roughly ₹5000 per month, which is not enough for a worker to sustain themselves or their family. In reality many workers in industrial areas are already forced to work 10–12 hours a day without proper overtime pay despite official working hours being 8 hours. With the implementation of these labour codes, this could increase further to 12–14 hours. Activists also discussed how job security, social security benefits and workplace safety protections are being weakened under these new laws.
Several workers and daily wage workers shared their experiences of long working hours, lack of overtime pay and poor working conditions. The campaign also highlighted that a majority of the workers in this area are women.
The activists raised demands that working hours should be reduced to six hours a day for which a minimum monthly wage of ₹30,000 should be guaranteed and equal pay must be ensured for men and women workers. They also emphasised that the four labour codes must be repealed and that one day strikes are not enough; workers must unite for a broader struggle, including an indefinite general strike, which is the only way for these codes to be repealed. Many workers listened attentively and took pamphlets distributed by the activists.
In the coming days too, Mazdoor Bigul will continue to hold such campaigns amongst the workers and employees of the organized and unorganized sector.